మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (18:37 IST)

పంద్రాగ‌స్టుకు ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం ముస్తాబు

ఆగ‌స్టు ప‌దిహేను సంబ‌రాల కోసం విజ‌య‌వాడ ముస్తాబు అవుతోంది. న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకలకు వచ్చే అతిధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర‌ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలకు సంబందించి చేపట్టవలసిన అంశాలపై అధికారులతో చర్చించారు. స్టేడియంలో గ్రౌండ్ లెవెలింగ్ చేసి రోలింగ్ చేయాలనీ, మరియు అతిధులు వచ్చే మార్గం లెవెల్స్ చేసి ఎంట్రన్స్ పెయింటింగ్ నిర్వహించాలని సూచించారు.

అవసరమైన ప్రదేశాలలో తాత్కాలిక మరుగు దొడ్లు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. స్టేడియం ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు అన్నియు శుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. గత రాత్రి కురిసిన భారి వర్షం కారణంగా స్టేడియంలో నిలిచిన వర్షపు నీటిని హై టేక్ మిషన్ ద్వారా తోడించి అవసరమైతే గ్రావెల్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.చంద్ర శేకర్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాత్రుడు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.