గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (14:20 IST)

పవన్-జగన్‌లిద్దరూ దున్నపోతులు.. కళ్లులేని కబోదులు: వేమా అయ్యాజీ

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి వేమా అయ్యాజీ వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం పవన్-జగన్ పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి వేమా అయ్యాజీ వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం పవన్-జగన్ పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు. స్వర్ణభారతి ట్రస్ట్ మహిళల సాధికారతకు కృషి చేస్తోందని, ఎంతో మందికి వైద్య సహాయం చేస్తోందని ఈ కార్యక్రమాలన్నీ ప్రజాసేవలో భాగమేనని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని, అందుకు ప్రధానితో, ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెబుతున్న పవన్, గతంలో ఎన్నడైనా వారితో మాట్లాడారా? అని ప్రశ్నించారు. 
 
ఆదివారం కాకినాడలో వేమా మీడియాతో మాట్లాడుతూ.. పవన్-జగలిద్దరూ దున్నపోతుల్లా తమ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని విమర్శిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు కళ్లులేని కబోదులని, వీరికి రాష్ట్రాభివృద్ధి కనిపించక పోవడం హాస్యాస్పదమని వేమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
కాగా, ప్రత్యేక హోదా కోసం సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు యువతకు స్పూర్తి ఇవ్వగా విద్యార్థులు రిపబ్లిక్‌ డే నాడు ర్యాలీకి ముందుకు వచ్చారు. కాగా ప్రత్యేక హోదాకు తనవంతు మద్దతు తెలిపాడు వైకాపా అధినేత జగన్‌. ర్యాలీని పోలీసులు అడ్డుకోగా జగన్‌, పవన్‌లు కూడా ప్రత్యేకంగా మీడియాను పిలిచి కేంద్ర, రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.