1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (17:04 IST)

మూడోసారి కూడా ఆడబిడ్డ.. భర్త ముఖం చాటేశాడు.. అమ్మేయాలనుకుంది

కన్నపేగునే అమ్ముకునేందుకు సిద్ధపడింది ఓ మాతృమూర్తి. బెజవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త నిరాదరణ, కుటుంబ పోషణ భారం కావడంతో ఇక దారిలేక 13 రోజుల శిశువును రూ.1.1 లక్షలకు విక్రయించింది. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెజవాడ, గొల్లపాలెంగట్టుకు చెందిన సాయిలక్ష్మీ అనే మహిళ తాను నవమాసాలు మోసి కన్న శిశువును అమ్మకానికి పెట్టింది. నవంబర్ 30వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు జన్మనిచ్చిన ఆమె.. మరో మహిళ సాయంతో హైదరాబాదుకు చెందిన వారికి 13 రోజుల పాపను రూ.1.10లక్షలకు అమ్మేయాలనుకుంది. 
 
కానీ ఈ విషయాన్ని గుర్తించిన అంగన్‌వాడీ సిబ్బంది.. చిన్నారి విక్రయాన్ని అడ్డుకుని తల్లి, మధ్యవర్తిని ఐసీడీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త మొహం చాటేశాడని.. ఇంకా పిల్లల పోషణ భారం కావడంతోనే బిడ్డను విక్రయానికి పెట్టానని ఆ తల్లి వాపోయింది.