గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (11:47 IST)

సూసైడ్ నోట్‌ను రాసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు..

రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేధించారు. దీంతో పోలీసులు వేధించారని ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులోని మహాలక్ష్మి లే అవుట్‌లో చోటు చేసుకుంది. వేణుగోపాల్‌ అనే వ్యక్తి ఇటీవల ఓ

రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేధించారు. దీంతో పోలీసులు వేధించారని ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులోని మహాలక్ష్మి లే అవుట్‌లో చోటు చేసుకుంది. వేణుగోపాల్‌ అనే వ్యక్తి ఇటీవల ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఇరువురి మధ్యా విబేధాలు వచ్చాయి. తమ కుమార్తెను వేణుగోపాల్‌ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు మహాలక్ష్మి లే అవుట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు గురువారం వేణుగోపాల్‌ తండ్రిని పోలీస్‌స్టేషనకు తీసుకెళ్ళి రోజంతా విచారించారు. వేణుగోపాల్‌ను పోలీసులు దుర్భాషలాడాడు. మానసికంగా ఇబ్బంది పడిన వేణుగోపాల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే పార్కుకు వెళ్లి రెండు పేజీల సూసైడ్‌నోట్‌ను రాసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ క్రిమిసంహారక మందు తాగాడు.

పార్కులో అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.