రూ.కోటి కొత్త నోట్లిస్తా... రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఇస్తావా.. బ్యాంక్ మేనేజర్ ఆఫర్
బ్యాంకు మేనేజర్లు దందా కొనసాగుతోంది. కొత్త నోట్లను అడ్డుపెట్టుకుని రెండు చేతులా అర్జిస్తున్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు నగల వ్యాపారులతో పాటు నల్లధన కుబేరులు నానాపాట్లు పడుతున్న విషయం తెల్సిందే. ఇ
బ్యాంకు మేనేజర్లు దందా కొనసాగుతోంది. కొత్త నోట్లను అడ్డుపెట్టుకుని రెండు చేతులా అర్జిస్తున్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు నగల వ్యాపారులతో పాటు నల్లధన కుబేరులు నానాపాట్లు పడుతున్న విషయం తెల్సిందే. ఇదే అదునుగా భావించిన పలు బ్యాంకు మేనేజర్లు.. తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ ఓ నగల వ్యాపారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్, పంజాగుట్ట ప్రాంతంలో ఓ నగల దుకాణ యజమానికి.. ఓ బ్యాంకు మేనేజర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను కోటిరూపాయల పాత నోట్లకు.. కోటి కొత్త నోట్లు ఇస్తానని.. దానికి ప్రతిఫలంగా రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇవ్వాలని అడిగాడు. దీనికి నగల వ్యాపారి సమ్మతించక పోగా.. ఈ పంచాయతీని ఓ రాజకీయ నాయకుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనకూ వాటా కావాలని రాజకీయ నేత ప్రతిపాదన చేశాడు. దీంతో ఏమిచేయాలో తెలియక.. సదరు బ్యాంకు మేనేజర్ సెలవుమీద వెళ్లిపోయాడు.