మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 28 జులై 2018 (20:35 IST)

ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలతో సత్ఫలితాలు...

అమరావతి : రాష్ట్రంలో ఉన్న 222 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల(ఇ యు.పి.హెచ్.సి.) ద్వారా నేటి వరకూ పట్టణ ప్రజలకు రూ.733.61 లక్షల సేవలందించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటనల వి

అమరావతి : రాష్ట్రంలో ఉన్న 222 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల(ఇ యు.పి.హెచ్.సి.) ద్వారా నేటి వరకూ పట్టణ ప్రజలకు రూ.733.61 లక్షల సేవలందించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటనల విడుదల చేశారు. నిరంతరం తీవ్ర ఒత్తిళ్ల మధ్య జీవనం సాగించే పట్టణ, నగర ప్రజలకు నాణ్యమైన, ఖరీదైన కార్పొరేట్ వైద్యమందించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా గతేడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. 
 
ఈ కేంద్రాలకు వచ్చే రోగులకు పరీక్షల నిమిత్తం 30 లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. అప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునీకరించి, వాటిని ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా సాధారణ సేవలతో పాటు కార్డియాలజీ, ఎండోక్రినాలజీ, ఆర్థోపెడిక్స్, రుమటాలజీ వంటి సేవలను అందిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపర్చడం,  ప్రైవేటు ఆసుపత్రుల నుంచి దోడిపి నుంచి పట్టణ పేదలను కాపాడడం, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేయడం ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 
 
అదే సమయంలో ప్రత్యేక నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 365 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి 12 మధ్యాహ్నం గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు లభిస్తుండడంతో, ఈ కేంద్రాలకు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. గతేడాది ఏప్రిల్ 7 నుంచి  ఈ ఏడాది జూన్ వరకూ 61,67,107 మంది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు పొందారన్నారు. ఈ సేవల ద్వారా రూ.733.61 లక్షల రూపాయల వరకూ పట్టణ ప్రాంత రోగులు ఆదా అయినట్లు ఆమె తెలిపారు. 
 
61.67 లక్షల మంది 4,85,169 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు  పొందారన్నారు. 35,39,837 పరీక్షలను లేబొరేటరీలలో నిర్వహించామన్నారు. రియల్ టైమ్ గవర్నర్ సిస్టమ్(ఆర్.టి.జి.ఎస్.) ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయసేకరణలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై ప్రజల నుంచి 98 శాతం సంతృప్తి స్థాయి వ్యక్తమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.