శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (08:30 IST)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు.. సోము వీర్రాజు - నేడు షాతో భేటీ

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం కేంద్రహోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అధికార వ్యవస్థ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారిపోయిందని దుయ్యబట్టారు. విద్య, ఆరోగ్యాన్ని వదిలేసి రాజధానిపై అనవసర చర్చ జరుగుతోందని సోమువీర్రాజు తప్పుబట్టారు. 
 
అలాగే, స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మటానికి వీల్లేదన్నారు. కాగా, సోమవారం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలుసుకోనున్నారు. ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.