సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (17:29 IST)

భద్రాచలం రామాలయం ఆంధ్రాకు దక్కాలి : బీజేపీ నేత సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపించారు. భద్రాచల రాముడు ఏపీ ప్రజల సొత్తు అని... కానీ, ఏపీవాసులకు అన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపించారు. భద్రాచల రాముడు ఏపీ ప్రజల సొత్తు అని... కానీ, ఏపీవాసులకు అన్యాయం చేసి, భద్రాచలంను తెలంగాణకు అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ... విభజన వల్ల సీమాంధ్ర వాసులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అదేసమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని... స్పెషల్ స్టేటస్ కోసం సభలు పెట్టి, ప్రజలను రెచ్చగొట్టినంత మాత్రాన ఏమీ ఒరగదన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దక్షిణాదిలో బలపడటమే బీజేపీ ప్రస్తుత కర్తవ్యమని అన్నారు.