గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (09:41 IST)

తెదేపాను పట్టించుకోవద్దు.. బీజేపీ నేతలకు అమిత్ షా

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై అధికార టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు కీలక సూచనలు చ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై అధికార టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం మాత్రం సానుకూలంగా పరిశీలిస్తోందని రాష్ట్ర బీజేపీ నేతలకు సమాధానమిచ్చారు.
 
గురువారం సాయంత్రం అమిత్ షాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అమిత్ షా పలు సూచనలు చేశారు.
 
కొద్ది రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని, బడ్జెట్‌ తర్వాత ఆ పార్టీ చేస్తున్న విమర్శలు చేశారు. 'అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా!' అని షా అన్నారు. 'ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు!' అని ఆయన చెప్పినట్లు పురందేశ్వరి వివరించారు.