మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (11:05 IST)

అమిత్ షా హిందువు కాదు.. రాహుల్ గాంధీ శివారాధన చేస్తారు: బబ్బర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత గొడవలు ప్రారంభమైనాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నాన్ హిందూ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత గొడవలు ప్రారంభమైనాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నాన్ హిందూ డిక్లరేషన్ బుక్‌లో సంతకం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, అమిత్ షాపై రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిందువే కాదన్నారు. ఆయన హిందువని మాత్రమే చెప్పుకుంటున్నారని తెలిపారు. అమిత్ షా జైన మతస్తుడన్నాడు. ముంబైలోని జైన కుటుంబంలో అమిత్ షా పుట్టారని, ఆపై గుజరాత్‌లో సెటిలయ్యారని చెప్పుకొచ్చారు. 
 
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి శివారాధన చేస్తున్నారు. ఇందిరా గాంధీ రుద్రాక్షమాల ధరించేవారు. శివుడిని పూజించేవారు మాత్రమే రుద్రాక్షమాల ధరిస్తారని రాజ్‌బబ్బర్‌ అన్నారు.