శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (10:37 IST)

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రియాంకా గాంధీ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేప

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రియాంకా గాంధీ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో వుంది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. ఆయన సోదరి ప్రియాంకా వాద్రాను కూడా క్రియాశీల రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
గతంలో రాయబరేలీ, అమేథీల్లో ఆమె ప్రచారం నిర్వహించినప్పుడే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పొడవడానికి ఒకరకంగా ప్రియాంకనే కారణమని ప్రచారం జరిగింది. కానీ యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో ప్రియాంకా రాజకీయ అరంగేట్రానికి బ్రేక్ పడింది. 
 
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రియాంక కూడా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలకు ముందే ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.