శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (10:28 IST)

సహనం కోల్పోయిన కర్ణాటక మంత్రి (వీడియో)

కర్ణాటక మంత్రి ఒకరు సహనం కోల్పోయారు. ఆయన పేరు డీకే శివకుమార్. మీడియాతో మినిస్టర్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు సెల్ఫీ తీసుకోబోయాడు. ఆ కుర్రోడి చర్యలను అసహనంగా భావించిన మంత్రి... లాగి చేయిపై ఒక్క దెబ్బకొట

కర్ణాటక మంత్రి ఒకరు సహనం కోల్పోయారు. ఆయన పేరు డీకే శివకుమార్. మీడియాతో మినిస్టర్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు సెల్ఫీ తీసుకోబోయాడు. ఆ కుర్రోడి చర్యలను అసహనంగా భావించిన మంత్రి... లాగి చేయిపై ఒక్క దెబ్బకొట్టాడు. అంతే ఆ యువకుడి చేతిలోని మొబైల్ కిందపడిపోయింది. 
 
పిల్లల హక్కులపై బెల్గాంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాతున్న సమయంలో వెనుక నుంచి ఓ యువకుడు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే మంత్రి ఆగ్రహించి.. ఆ అబ్బాయిని కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అయితే, యువకుడిని కొట్టడాన్ని మంత్రి శివకుమార్ సమర్థించుకున్నారు. ఇలాంటి సంఘటనలు సహజమేనని చెప్పుకొచ్చారు. కొంచెమన్న ఇంకితజ్ఞానం ఉండాలి. నేను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఆగస్టు నెలలో మంత్రి శివకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ దాడులు చేసిన విషయం విదితమే. సుమారు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం.