శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (02:34 IST)

మన విమానాలకు ఏం రోగం వచ్చినట్లో... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కట్. మళ్లీ ఆదుకున్న ఫైటర్ జెట్

అడవిలో మనిషి దారి తప్పవచ్చు. జంతువులు జాడ పసిగట్టడంలో ఫెయిల్ కావచ్చు. రహదారులపై డ్రైవర్ల అవగాహన లేమితో వాహనాలు దారితప్పవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ భారతీయ విమానాలు మనకు తెలీని విషయాలను కూడా నేర్పడానికి ముందుకు వస్తున్నయి.

అడవిలో మనిషి దారి తప్పవచ్చు. జంతువులు జాడ పసిగట్టడంలో ఫెయిల్ కావచ్చు. రహదారులపై డ్రైవర్ల అవగాహన లేమితో వాహనాలు దారితప్పవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన  విషయాలే. కానీ భారతీయ విమానాలు మనకు తెలీని విషయాలను కూడా నేర్పడానికి ముందుకు వస్తున్నయి. ఆకాశంలో దూసుకెళుతున్న విమానం కనిపించకుండా పోతే ఎలా ఉంటుందన్న పాడు అనుభూతిని కూడా మేం చూపిస్తాం అంటున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు భారతీయ విమనాలు రాడార్ కంటికి కనిపించకుండా ఆకాశంలో మాయమవడం, ఎస్కార్టు విమానాలు వాటి  జాడను పసిగట్టడం షాక్ తెప్పిస్తోంది. ఇది ఏ శిక్షణలో భాగం అంటే చెప్పడానికి ఏ అధికారీ ముందుకు రాకపోవడం మరొక వింత.
 
ఇండియన్ ఫ్లైట్స్ తరచుగా యురోపియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోతుండటం, వాటిని ఫైటర్స్ జెట్స్ అత్యవసరంగా ఎస్కార్ట్ చేయాల్సి రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. శుక్రవారం హంగేరీ గగనతలంపై మరోసారి పునరావృతమైన ఘటనే అందుకు నిదర్శనం. శుక్రవారం ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్, న్యూయార్క్ బయల్దేరిన ఓ విమానానికి ఉన్నట్టుండి హంగేరీ గగనతలంపై ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు గంటసేపు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడుంది, ఏంటనే సమాచారం ఏదీ అందుబాటులో లేకుండాపోయింది.
 
విషయం తెలుసుకున్న హంగేరీ తమ ఫైటర్ జెట్స్‌ని అత్యవసరంగా రంగంలోకి దింపి ఆ విమానం ఆచూకీ కనుగొనడంతోపాటు దానిని సురక్షితంగా లండన్‌లోని హీథ్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే వరకు వెంట తీసుకెళ్లాయి. ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన ఇండియన్ ఎయిర్ లైన్స్ AI 171 విమానంలో 231 మంది ప్రయాణికులతోపాటు 18 మంది సిబ్బంది వున్నారు.
 
దాదాపు గంటసేపు విమానంతో సంబంధాలు తెగిపోవడంపై సంబంధిత భద్రతాధికారి విచారణ మొదలుపెట్టినట్టు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 45 నిమిషాల నుంచి దాదాపు గంటసేపు విమానానికి ఏటీసీతో సంబంధాలు లేవు. విమానం స్పీడ్ అంచనానుబట్టి ఆ సమయంలో విమానం 600-800 కిమీ ప్రయాణించడమేకాకుండా రెండు యురోపియన్ దేశాలని కూడా దాటి వుండవచ్చు అని అంచనా వేస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు.