సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (16:04 IST)

అసెంబ్లీకి డుమ్మాకొట్టి అమ్మాయిలతో స్టెప్పులేసిన హీరో... (వీడియో)

ప్రజాప్రతినిధులు ప్రజలు చెల్లించే పన్నులను సొమ్మును వేతనంగా తీసుకుంటా, తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. యేడాదిలో రెండుమూడు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా వారు హాజరుకావడంలేదు.

ప్రజాప్రతినిధులు ప్రజలు చెల్లించే పన్నులను సొమ్మును వేతనంగా తీసుకుంటా, తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. యేడాదిలో రెండుమూడు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా వారు హాజరుకావడంలేదు. ఈ కోవలో కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు.
 
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీబీఐ ఏ1 నిందితుడిగా పేర్కొన్న మంత్రి కేజే జార్జి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 
 
అలాంటి సమావేశాలు మండ్యా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటుడు అంబరీష్ అసెంబ్లీకి డుమ్మాకొట్టి బెంగళూరులో జరిగిన 'ఉప్పు హుళి ఖార' సినిమా టీజర్ విడుదల వేడుకలో అంబరీష్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా యాంకర్ అనుశ్రీ కోరిక మేరకు సినీ నటి మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీంతో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.