శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (09:07 IST)

'గేమ్ ఆఫ్ అయోధ్య'కు ఫిల్మ్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్.. 24న విడుదల

బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా ''గేమ్ ఆఫ్ అయోధ్య'' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు సునీల్ సింగ్ వెల్లడించారు. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫిల్మ్ ట్రై

బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా ''గేమ్ ఆఫ్ అయోధ్య'' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు సునీల్ సింగ్ వెల్లడించారు. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫిల్మ్ ట్రైబ్యునల్ జోక్యంతో ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా బయటకు రాని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు తొలుత సెన్సార్ బోర్డు నిరాకరించింది. అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జోక్యంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. 
 
సున్నితమైన అయోధ్య నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇప్పటికీ వివాదం కొనసాగుతుండటంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ నిరాకరించింది. మత విద్వేషాలను ఈ సినిమా రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పింది. కానీ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరెకెక్కించడంతో ఫిల్మ్ ట్రైబ్యునల్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.