శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (15:02 IST)

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు ఉన్నారు. 
 
నిజానికి మణిరత్నం - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. ప్రధానంగా 'రోజా', 'దళపతి', 'బొంబాయి', 'కాదల్' వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
అయితే, ఈ మల్టీస్టారర్ చిత్రంలో సహజ నటి జయసుధతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలను పోషించనున్నారేనే వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అలాగే, సంతోష్ శివన్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. అయితే, తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిలకు మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.