బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 10 నవంబరు 2016 (12:29 IST)

అమరావతి రైతుల ఇనుప పెట్టెల్లో 'నల్ల' డబ్బు... బావురుమంటున్న పెద్ద రైతులు

ల్యాండ్ పూలింగ్‌కి త‌మ సారవంతమైన పొలాలు ఇచ్చిన రైతులు ఇపుడు ల‌బోదిబోమంటున్నారు. పూలింగ్‌లో టౌన్‌షిప్ కింద, వాణిజ్య‌ సముదాయాల కింద పొందే తమ వాటా స్థలాలు చూస్తే పాలు ఇచ్చే గెదను అమ్ముకుని, దున్నపోతును కొనుక్కున్న సామెత లాగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చే

ల్యాండ్ పూలింగ్‌కి త‌మ సారవంతమైన పొలాలు ఇచ్చిన రైతులు ఇపుడు ల‌బోదిబోమంటున్నారు. పూలింగ్‌లో టౌన్‌షిప్ కింద, వాణిజ్య‌ సముదాయాల కింద పొందే తమ వాటా స్థలాలు చూస్తే పాలు ఇచ్చే గెదను అమ్ముకుని, దున్నపోతును కొనుక్కున్న సామెత లాగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు త‌మ భూముల‌ను, ఆస్తుల‌ను అమ్ముకుని, ఆ సొమ్మును ఇంటిలో దాచుకున్నారు. 
 
ఇపుడు ఒక్క‌సారిగా 500, వెయ్యి నోట్లు ర‌ద్దు కావ‌డంతో, వాటిని ఎలా మార్చుకోవాలో తెలియ‌క భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. ప్రభుత్వ ధర కంటే పదిరెట్లు ధరకు అమ్మి ఆ డబ్బును ఇనుప బీరువాల్లో దాచుకున్నవారు చాలామంది ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బంతా నల్లడబ్బు కింద మారిపోయింది. దాన్ని ఇపుడు ఏం చేయాలో తెలియని స్థితి ఏర్పడింది. 
 
విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న బడా ధనవంతులు ఎస్కేప్ అయిపోయారు కానీ ఇలా భూములను అమ్ముకుని ఇళ్లలోనే దాచుకున్న రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నట్లు సమాచారం. ఇపుడా నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది.