బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 మే 2018 (17:49 IST)

బోండా ఉమ కాజేశారయ్యా... రూ. 35 లక్షలు తీసుకుని...

ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు స్థలం ఇస్తామని చెప్పడంతో బోండా ఉమకు రూ. 35 లక్షలు ఇచ్చామనీ, కానీ ఎంతకీ స్థలాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. 
 
కాగా బోండా ఉమా మహేశ్వర రావుపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం. గతంలోనూ ఆయన కొంతమంది భూములను ఆక్రమించారనీ, తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఆయన కొట్టిపారేశారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.