శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:20 IST)

మద్యం బాబులకు శుభవార్త - ఏపీలో ప్రీమియం బ్రాండ్ల విక్రయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందు బాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి ప్రీమియర్ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్టు తెలిపింది. 
 
ఈ ప్రీమియం బ్రాండ్లను బార్లు, వాక్‌ ఇన్ స్టోర్లలో విక్రయించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మద్యం బాబులు పండుగ  చేసుకుంటున్నారు. అసలు సిసలు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఏపీలోని మద్యం బాబుల ఆనందం అంతా ఇంతా కాదు.