చెల్లిని ప్రేమించాడనీ యువకుడిని కాల్చి చంపిన అన్న
హైదరాబాద్ నగరం పాతబస్తీలో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించాడనీ ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా సజీవదహనం చేశాడో అన్న. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్ నగరం పాతబస్తీలో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించాడనీ ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా సజీవదహనం చేశాడో అన్న. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పాతబస్తీకి చెందిన ఓ యువతి పురోహిత్ మహేష్ అనే యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. ఈ విషయం యువతి కుటుంబంలో తెలియడంతో వారు మందలించారు. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో చెల్లి కారణంగా తమ పరువుకు భంగం కలుగుతుందన్న ఆలోచనతో పురోహిత్ మహేష్‌ను హతమార్చాడు.
హత్య చేసినట్టు తెలియకుండా ఉండేందుకు అనవాలు లేకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. మృతదేహాన్ని ఓ కారు సర్వీసింగ్ సెంటర్‌లో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయంపై కారు సర్వీసింగ్ సెంటర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.