విజయసాయికి బుద్దా వెంకన్న వెరైటీ జన్మదిన శుభాకాంక్షలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న వినూత్న శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రూ.300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్‌కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా?
ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. బుద్దా వెంకన్న వినూత్న శైలిలో జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.