శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 మే 2020 (07:30 IST)

నేనెందుకు కారు దిగానంటే...? : విజయసాయిరెడ్డి వివరణ

జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ని సీఎం కారు నుంచి దింపేశారంటూ విమర్శలు రేగిన విషయం తెలిసిందే. దానిపై విజయసాయి వివరణ ఇచ్చుకున్నారు.
 
‘‘విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖ వచ్చేందుకు విజయవాడలోని నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు కారులో బయలుదేరారు. ముందు కారెక్కిన నేను తరువాత దిగిపోయిన మాట నిజమే.

పరామర్శ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే బాధితులకు న్యాయం జరుగుతుందని భావించా. దీంతో నేనే కారు దిగి మంత్రిని ఎక్కాలని కోరాను. దీనిని ప్రతిపక్షాలు చిలువలుపలువలుగా చిత్రీకరించాయి’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

విశాఖ గ్యాస్ లీక్ పై మాట్లాడుతూ... బాధితులకు పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.