శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (12:11 IST)

అది సీఎం జగన్‌ గారి గొప్పదనం: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అలాగే, సిమెంట్‌ ధరలు తగ్గేలా చేయడం సీఎం జగన్ గొప్పదనంగా ఆయన అభివర్ణించారు.
 
'రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. నువ్వెన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం. శిఖండిని అడ్డం పెట్టుకుని నువ్వు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుంది. కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదు' అని ట్వీట్ చేశారు.
 
'ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయి. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సీఎం జగన్ గారి గొప్ప విజయం' అని తెలిపారు.