శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (14:43 IST)

కరోనా వైరస్ సోకకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలి.. చంద్రబాబు పిలుపు

కరనా వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ చర్యలు తీసుకోకుండా మామూలుగానే వ్యవహరిస్తున్నారు. ఇతరులకు కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలి. ఇలా చేసి కరోనా సోకే అవకాశాలను తగ్గించుకోవచ్చు. కరోనా విజృంభణపై ఓ ఫొటో పోస్ట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆ ఫొటోలో అగ్గిపుల్లలు ఒకదానిపక్కన ఒకటి ఉన్నాయి. దీంతో మొదటి అగ్గిపుల్లకు మంట అంటుకోగానే రెండో దానికి, దాని నుంచి మూడో దానికి ఇలా అన్నింటికీ అగ్ని అంటుకుంటుంది. అయితే, మధ్యలో ఒక అగ్గిపుల్ల దూరంగా జరుగుతుంది. దీంతో దానికి అగ్ని అంటుకోదు.. దీంతో దాని తర్వాత ఉన్న అగ్గిపుల్లలకు కూడా మంట అంటుకోదు.
 
కరోనా వ్యాప్తిస్తోన్న తరుణంలో ఈ వర్ణన ప్రస్తుత పరిస్థితులకు అద్భుతంగా పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో సమాజంలో ప్రజలకు దూరంగా ఉండడం వల్ల మనల్ని మనం కరోనా బారినుంచి కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించవచ్చని తెలిపారు. ఈ కరోనా మహమ్మారి గురించి జగన్ చర్యలు తీసుకోకుండా మామూలుగానే వ్యవహరిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ఈ వ్యాధి సోకుకుండా చూసుకోవాలని చెప్పారు. 
 
జనసమూహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలని, ఇలా చేసి కరోనా సోకే అవకాశాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. మన కుటుంబాల కోసం కరోనాపై మరింత బాధ్యతగా మాట్లాడుతూ, కరోనాపై అవగాహన కల్పిద్దామని పిలుపునిచ్చారు.