కోర్టులను కూడా చంద్రబాబు మ్యానేజ్ చేసేస్తారా? మరి స్విస్ ఛాలెంజ్, కారెం శివాజీ కేసులు?
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేయడంలో దిట్ట. ఏ రిట్ అయినా తనకు అనుకూలంగా మార్చుకోగల ట్యాలెంట్ ఆయన సొంతం అని పలువురు బాబుపై విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే, కింది కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు హయాం
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేయడంలో దిట్ట. ఏ రిట్ అయినా తనకు అనుకూలంగా మార్చుకోగల ట్యాలెంట్ ఆయన సొంతం అని పలువురు బాబుపై విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే, కింది కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు హయాంలో నియమించిన వారే ఎక్కువమంది ఉన్నారు. హైకోర్టులో మొదలుకొని సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్.వి.రమణ వరకు అందరితో చంద్రబాబుకు మంచి ర్యాపో ఉందని, అందుకే ఆయనకు స్టేలు సునాయాసంగా వచ్చేస్తాయని విమర్శలున్నాయి.
కానీ, ఇటీవల రెండు కేసులు ఈ విమర్శలను తలకిందులు చేస్తున్నాయి. ఒకటి అమరావతి స్విస్ ఛాలెంజ్ కేసు, రెండోది కారెం శివాజీ కేసు. తాజా ఉదంతాలను విశ్లేషిస్తే, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం చెల్లదని హైకోర్టు కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ నియమాకంలో సరిగా విధి విధానాలను పాటించలేదని తీర్పు చెప్పింది. మరో పక్క అమరావతి నిర్మాణంపై ఏపీ అనుసరించిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కోర్టు కొట్టేసింది. అయితే, దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నోటిఫికేషన్ రద్దు చేసుకుని, చట్టంలో మార్పులు చేసుకుని తప్పు సరిదిద్దుకున్నారు.
ఇపుడు తాజాగా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ చేయడాన్ని సవాలు చేస్తూ, ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ నియామకం చెల్లదని, తగిన వ్యక్తిని వేరేవారిని నియమించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. పైగా ఈ తీర్పుపై అప్పీలుకు కూడా వెళ్ళరాదని తేల్చింది. ఇంత ఘాటుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి తీర్పును చూసిన విమర్శకులు, చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేస్తున్నారనే మాటపై నాలుక్కరుచుకుంటున్నారు.