గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (19:05 IST)

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరిన విషయం తెల్సిందే. 
 
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కొన్ని రోజుల క్రితమే ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కానీ కోర్టు మాత్రం ఇరు వర్గాల వాదనలు ఆలకించి సానుకూలంగా స్పందించింది.