1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (13:49 IST)

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ కదిలివచ్చి ఓటేయండి : సీఎం జగన్ ట్వీట్

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
ఫలితంగా ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మూడో ఎన్నికలు ఇవి. గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా మాత్రం సుదూర ప్రాంతాల నుంచి సైతం ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. 
 
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశఆరు. "నా అవ్వతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ.. అందరూ కదిలి రండి. తప్పకుండా ఓటు వేయండి" అంటూ తన సందేశం ఇచ్చారు.