బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 మార్చి 2017 (18:21 IST)

జగన్ బెయిల్ రద్దు చేయండి... సీబీఐ, మళ్లీ జైలుకా...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడినట్లు అగుపిస్తోంది. ఆయన సీబీఐకి వ్యతిరేకంగా తన సాక్షి చానల్ లో ఓ ఇంటర్వ్యూ ప్రసారమైందనీ, ఈ ఇంటర్వ్యూ కేసును ప్రభావితం చేసేట్లు వుందని సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడినట్లు అగుపిస్తోంది. ఆయన సీబీఐకి వ్యతిరేకంగా తన సాక్షి చానల్‌లో ఓ ఇంటర్వ్యూ ప్రసారమైందనీ, ఈ ఇంటర్వ్యూ కేసును ప్రభావితం చేసేట్లు వుందని సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటీషన్ స్వీకరించిన సీబీఐ కోర్టు జగన్ మోహన్ రెడ్డిని వచ్చే నెల 7వ తేదీలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. 
 
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ ఆయనపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులపై అటు సీబీఐ ఇంకోవైపు ఈడీ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి. అంతకుముందు ఈ ఆస్తుల కేసు వ్యవహారంలో సంవత్సరన్నర జైలులో వున్నారు జగన్. ఆ తర్వాత ఆయన ఆస్తుల కేసు నడుస్తూనే వుంది. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కేసును ప్రభావితం చేసేట్లుగా వుందంటూ సీబీఐ పిటీషన్ వేయడంతో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళతారా అనే మాటలు వినిపిస్తున్నాయి.