1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (17:01 IST)

తెదేపా ఎంపీల ఆందోళనతో కేంద్రంలో కదలిక... ప్యాకేజీపై కసరత్తుకు ప్రధాని మోడీ ఆదేశం

ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రి వెంకయ్య

ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిద్దరు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించారు.
 
ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యకు ప్రధాని కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేయాలని ప్రధాని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకావాలని అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడుకు ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేసిన తర్వాత ప్రకటన చేద్దామని వెంకయ్యతో ప్రధాని మోడీ చెప్పినట్టు తెలుస్తోంది.
 
కాగా, హోదా కోసం ఇక నుంచి పోరాటం చేస్తామని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పడం, ఇవాళ టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో కేంద్ర మంత్రులు అప్పటికప్పుడే జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రధాని, ఆర్థిక మంత్రికి వెంకయ్య, సుజనా చౌదరి వివరించనున్నారు. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.