బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (06:47 IST)

నావల్ల కాదు మామా అంటేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు: చంద్రబాబు జ్ఞాపకాలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను సినిమాటోగ్రపీ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్లా కాదని వ్యవస్థను మార్చాలంటే మీవంటివారు రాజకీయాల్లోకి రావాలని తాను సలహా ఇచ్చినందువల్లే ఎన్టీఆర్ రాజకీయ పార్టీని పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు గత జ్ఞాపకాలను

కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను సినిమాటోగ్రపీ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్లా కాదని వ్యవస్థను మార్చాలంటే మీవంటివారు రాజకీయాల్లోకి రావాలని తాను సలహా ఇచ్చినందువల్లే ఎన్టీఆర్ రాజకీయ పార్టీని పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు గత జ్ఞాపకాలను తవ్వి పోశారు. బుధవారం రాత్రి గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది తానేనని నొక్కి చెప్పారు.
 
ఈ సందర్భంగా తన ఆరోగ్య రహస్యాలను కూడా చంద్రబాబు కార్యకర్తలతో పంచుకున్నారు. తన భార్య చేతిలో ఉండే రిమోట్ నన్ను అదుపులో ఉంచుతుంది కాబట్టి తాను ఆహార నియమాలను చాలా బాగా పాటిస్తాను. బతకడానికి తింటాను కానీ తింటానికి బతకను అని బాబు చెప్పారు. పైగా తాను అరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని, నేను ఆనారోగ్యం పాలైతే రాష్ట్రానికే సుస్తీ చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
 
ఇదంతా బాగుంది కానీ ఎన్టీరామారావును రాజకీయాలవైపు ప్రోత్సహించింది, తనను పార్టీ పెట్టేలా ప్రోద్బలం ఇచ్చింది నాదెండ్ల భాస్కరరావు అని గత 35 ఏళ్లలో పలుసార్లు  మీడియా కోడై కోసింది. ఈ వాస్తవాన్ని తోసిపుచ్చి తాను చెబితేనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించారని చంద్రబాబు చెప్పడం టీడీపీ పార్టీ కార్యకర్తలకే మింగుడు పడలేదన్నది వేరే విషయం.