బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 3 జులై 2018 (14:19 IST)

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయి బ్రాహ్మ‌ణులపై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసారు. నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయి బ్రాహ్మ‌ణులపై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసారు. నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. వీరి దీక్ష‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తెలియ‌చేసింది. 
 
ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నాయీబ్రాహ్మణులు సీఎం చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన తన స్థాయిని మరచి మరీ అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. 
 
చంద్రబాబుకు బీసీల కష్టనష్టాలు పట్టడంలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు, వారికి దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సెలూన్లకు విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ ఇస్తామని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటూరి బాబ్జీనంద మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు.