మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (13:12 IST)

ముంబై నటి వివాదంపై సీఎం స్పందన.. స్టోరీలు వింటుంటే బాధేస్తోంది.. (video)

Chandra babu
Chandra babu
ముంబై నటి కాదంబరి జెత్వాని వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. "రోజు రోజుకూ ఆ స్టోరీలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. వైసీపీ నేతల ప్రవర్తనలు, ఆ కథలు విన్నప్పుడు అసహ్యం అనిపించడం లేదా? నేను నా రాజకీయాల జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. రాజకీయాల్లో చిన్నది జరిగితేనే పెద్ద స్కాండల్‌లా చూసేవాళ్లం" అంటూ చెప్పుకొచ్చారు. ఇది చాలా హేయమైన చర్య అంటూ దీన్ని సీఎం ఖండించారు. ఇంత జరుగుతుంటే వైకాపా చీఫ్ మిన్నకవుండటం ఏంటి అంటూ ప్రశ్నించారు. 
 
ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తుంటే జగన్ నోరు మెదపక వుండటం ఏంటని అడిగారు. తాను అలా వుండనని.. రాజకీయ నేతలు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా.. ఇది ఆదర్శవంతమా అంటూ అడిగారు. 
 
ముంబైకు చెందిన నటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అధికారులు చిత్రహింసలకు గురి చేశారనే వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.