శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 9 జనవరి 2022 (22:03 IST)

బాబుగారు.. ఈ వయస్సులో ఈ స్టంట్‌లేంటి?

ఒక పక్క బాంబులు పెట్టారు. పట్టించుకోలేదు. వయస్సు పైబడి ఆయాసం వస్తోంది లెక్కచేయలేదు. అక్రమార్కుల భరతం పట్టాలనుకున్నాడు. అక్రమ మైనింగ్ వైపు అడుగులు వేశాడు. 250 అక్రమ క్వారీలను గుర్తించి మీడియా ప్రతినిధులకు చూపించారు.

 
70 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు చేసిన అడ్వెంచర్ అంతాఇంతా కాదు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చంద్రబాబు అక్రమ క్వారీలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. ప్రశ్నిస్తున్న గ్రామస్తులపైనే కేసులు పెడుతున్నారని బాబు దృష్టికి పలువురు తీసుకువచ్చారు.

 
దీంతో పర్యటన చివరి నిమిషంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేరుగా అక్రమ క్వారీల వైపు కారును పోనివ్వమన్నారు. మూడుకిలోమీటర్లు అక్రమ క్వారీల్లోనే  నడిచారు. గంటన్నరకుపైగా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అక్రమార్కుల బండారం బయటపెట్టాలనుకున్నారు. వెంటనే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందంటూ చంద్రబాబు ఆరోపించారు.

 
వెంటనే పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అక్రమ మైనింగ్ పైన జ్యుడీషియల్ విచారణ కూడా జరిపించాలన్నారు. అయితే వయస్సు పైబడిన చంద్రబాబు క్వారీల్లో నడిచి వెళ్ళడం మాత్రం కుప్పం ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.