శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 23 ఆగస్టు 2019 (19:13 IST)

కన్నాను మార్పించేందుకు చంద్రబాబు ప్లాన్... ఎవరు?

మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. టిడిపి నుంచి వెళ్ళిన ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు ఇద్దరూ చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని, వారి మధ్య బంధం ధృఢంగా కొనసాగుతోందంటూ చెప్పారు. ఈసారి ఏకంగా బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణనే చంద్రబాబు టార్గెట్ చేశారని.. ఆయన్ను మార్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
గతంలో ఎపి బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజును కాకుండా అడ్డుకున్నారని అదంతా చంద్రబాబు చేసిన పనేనన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బిజెపి ఎంపిల సహకారంతో కన్నా లక్ష్మీనారాయణను తప్పించి తనకు కావాల్సిన వ్యక్తిని ఆ పార్టీలో అధ్యక్షుడిగా తీసుకువచ్చే ప్రరయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.