1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (22:37 IST)

29 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 29 నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈనెల 29న కుప్పంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.

అలాగే ఈనెల 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దారణంగా ఓటమి చెందింది.

ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం తన సొంత నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారు. పార్టీ  కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.