జగన్ సైకో... చంద్రబాబు, బాబు పిచ్చోడు... జగన్... ఎందుకీ తిట్ల పురాణం...?
కడప: ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు ప్రధాన పార్టీలు రెండు... ఒకటి టీడీపీ... రెండోది వైసీపీ... రెండు పార్టీలకు పెద్ద దిక్కు...ఒకరు సీఎం చంద్రబాబు... రెండోది వై.ఎస్. జగన్. కానీ, ఇద్దరు అంత పెద్ద హోద
కడప: ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు ప్రధాన పార్టీలు రెండు... ఒకటి టీడీపీ... రెండోది వైసీపీ... రెండు పార్టీలకు పెద్ద దిక్కు...ఒకరు సీఎం చంద్రబాబు... రెండోది వై.ఎస్. జగన్. కానీ, ఇద్దరు అంత పెద్ద హోదాలలో ఉండి... ఒకరిపై ఒకరు ద్వేషపూరితంగా తిట్టుకోవడం సామాన్య ప్రజలకు బాగా అనిపించడం లేదు. కడప జిల్లా రాజంపేటలో శనివారం జరిగిన మహా ధర్నా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద వైసీపీ అధ్యక్షుడు జగన్ దుమ్మెత్తి పోశాడు. చంద్రబాబు పిచ్చోడని చెలరేగిపోయారు. దొరికిన దొంగ చంద్రబాబు అంటూ తిట్లపురాణం అందుకున్నారు జగన్.
ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న దొంగోడని... రైతులకు ఏమీ చేయకుండా చేసినట్టు అబద్దాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న దొంగోడని నోరు పారేసుకున్నాడు. అంతకుముందు రోజు చంద్రబాబు రాయలసీమలో పర్యటించారు. రైతుల సమస్యలకు పరిష్కారం రెయిన్ గన్ల ప్రచారం చేశారు. కానీ, ఆ మంచి పని చేస్తూ, కూడా చెడును తలుచుకున్నారు. జగన్ మీద మానసిక దాడి చేస్తూ, సైకో జగన్ మొండోడని దుమ్మెత్తిపోశారు.
మీ నాన్న వై.ఎస్. నన్ను ఏమీ చేయలేకపోయాడు... నువ్వేం చేస్తావని జగన్‌ని రెచ్చగొట్టారు. మూర్ఖుడు, పిల్లకాకి, పనికిమాలినోడు…అంటూ నోటికొచ్చినట్టు తిట్ల పురాణం అందుకున్నారు. వీళ్లిద్దరు ఇలా తిట్టుకుంటుంటే... సామాన్య ప్రజలు నోరెళ్ళబెడుతున్నారు. ఈ పార్టీ పెద్దల పర్యటన వల్ల రాయలసీమ ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.