జగన్‌కు ప్రభాకర్ సవాల్ : ఏలూరుకు రా.. చెప్పుతీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్‌నే కాదు!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందంటూ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.
దీనిపై టీడీపీ నేతలలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇందులోభాగంగా చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ... జగన్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని అన్నారు. 'జగన్, ఏలూరురా, నిన్ను చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్ నే కాదు' అంటూ ఆయన సవాల్ విసిరారు.
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? అని అడిగారు. పధ్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన జగన్ కు హితవు పలికారు.