శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:38 IST)

చిన్నారిపై కామాంధుడు అత్యాచారం.. ఆపై హత్య.. ఐదేళ్ల అమ్మాయిపై తాగి..?

ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగ

ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె సమీపంలోని కోళ్లపారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులకు అమ్ములు (5) అనే కుమార్తె ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలిసి వారంతా సినిమాకు వెళ్లారు.
 
తిరిగి వస్తూ దారిలో ముగ్గురూ మద్యం తాగారు. ఇంటికి చేరుకున్న కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అమ్ములు సమీపంలో విగతజీవిగా పడి ఉంది. మునుస్వామి కనిపించకుండా పోయాడు. అమ్ములుపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునిస్వామి ఈ అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.