1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (15:43 IST)

చిత్తూరులో 'జైభీమ్' తరహా ఘటన - విచారణకు పిలిచి మహిళపై దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జైభీమ్ తరహా ఘటన ఒకటి జరిగింది. విచారణ పేరుతో ఓ మహిళను స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ నెల 18వ తేదీన రూ.2 లక్షలు మాయమయ్యాయి. ఈ నేరాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి పని మనిషిపై మోపారు. ఈ డబ్బును పని మనిషి తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఆ మహిళను స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత బాధితురాలిని పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా కొట్టినప్పటికీ ఆమె చేయని తప్పును అంగీకరించలేదు. దీంతో ఆమెను వదిలివేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఇపుడు కనీసం నడవలేని స్థితిలో ఉంది.