గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (10:30 IST)

భార్య ఉండగా మరో ప్రేమ వివాహం.. ఆపై ఏమైందంటే?

చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం పెనుకొలగల  గ్రామంలో విషాదం నెలకొని ఉంది. గ్రామానికి చెందిన  అమరనాథ్ (32) బెంగుళూరులో గత ఐదు ఏళ్లుగా  ఓ హోటల్ నందు పనిచేస్తున్నాడు. అదే హోటల్ లో  పనిచేస్తున్న నార్త్ ఇండియన్ అమ్మాయి అంజలితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఆమెను వివాహం చేసుకున్నాడు అమర్ నాధ్. 
 
అయితే అమరనాధ్ కు ఇదివరకే మదన పల్లి 150 వ మైలు  పంచాయితీకి చెందిన  సంద్యారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారై కూడా ఉంది. భార్య కుమారైను మదన పల్లెలో ఉంచుతూ అక్కడ హోటల్‌లో పనిచేసుకుంటున్నాడు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో తన రెండో భార్య అంజలితో ఊరులో అడుగుపెట్టాడు. మరుసటి రోజు  తమ వ్యవసాయ పొలం వద్ద అంజలి, అమర నాధ్ లు ఇద్దరూ చెట్టకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యుకు గల కారణాలు తెలియరాలేదు..