బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (21:30 IST)

మా ఇంట్లో అన్నీ ప్రేమ పెళ్ళిళ్లు... నేనైతే: కీర్తి సురేష్

తెలుగు, తమిళ బాషల్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది కీర్తి సురేష్. అదీ ఇదీ అని కాకుండా సకల పాత్రలలోను దూసుకుపోతోంది. ఓ వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్ని మరో వైపు కమర్షియల్ చిత్రాలను కూడా ఎంచుకుంటోంది. 
 
కీర్తి సురేష్ నటించిన సినిమాల్లో 90 శాతంకి పైగా మంచి హిట్ సాధించినవే. తమిళ బాషలో అయితే కీర్తిని టాప్ హీరోయిన్ల స్థాయికి తీసుకెళ్ళిపోయాయి కొన్ని సినిమాలు. ఇక తెలుగులో ఆమె నటించిన మహానటి గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి బాగా ఒదిగిపోయిందంటూ పొగిడిన వారు లేకపోలేరు. 
 
అయితే కెరీర్ పరుగులో ఉన్న కీర్తిని ప్రేమ, పెళ్ళి గురించి కదిలిస్తే బోలెడు కబుర్లు చెప్పేస్తుందట. మా ఇంట్లో ప్రేమ పెళ్ళిళ్ళు సహజమే. మా అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. మా అక్క కూడా అలాగే చేసుకుంది. ఇక నేను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానా లేదా అన్న సంగతి మీకు త్వరలోనే తెలుస్తుంది అంటోంది కీర్తి సురేష్.