గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (19:05 IST)

వివాహ దోషాలు వున్నవారు ఆలయాల్లో ఎన్ని వత్తులతో దీపాలు వెలిగించాలో తెలుసా? (video)

దీపజ్యోతితో పరమేశ్వరుడిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. దీపాన్ని వెలిగించి దీపారాధన ద్వారా పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీపారాధన మంగళప్రదం. వేదమంత్రాలు కూడా దీపారాధనతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని చెప్తున్నాయి.
 
అందుకే ఆలయాలకు వెళ్ళేటప్పుడు నేతితో దీపం వెలిగించాలి. దీపాలను బేసి సంఖ్యలోనే వెలిగిస్తుంటారు. మూడు, ఐదు లేదా తొమ్మిది దీపాలను వెలిగించడం ద్వారా మంచి జరుగుతుందనుకుంటారు. కానీ అలా చేయకూడదు. దేవతామూర్తులకు ఎన్నెన్ని దీపాలు వెలిగించాలో ఓ లెక్కుందని పండితులు చెప్తున్నారు దీని ప్రకారం.. దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని వారు సూచిస్తున్నారు.
 
శనిదోషం వున్నవారు తొమ్మిది దీపాలను వెలిగించాలి. గురు దోషాన్ని తొలగించుకోవాలంటే 32 దీపాలను వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే దుర్గాదేవికి 9 నేతి లేదా నువ్వుల దీపాలు, ఈశ్వరునికి 11 దీపాలు, విష్ణుమూర్తికి 15 దీపాలు, శక్తి మాతకు 9 దీపాలు, మహాలక్ష్మీదేవికి ఐదు దీపాలు, కుమార స్వామికి 9 దీపాలు, విఘ్నేశ్వరునికి ఐదు దీపాలు, ఆంజనేయస్వామికి ఐదు దీపాలు, కాలభైరవునికి ఒక్క దీపం వెలిగించాలి. 
 
ఇకపోతే.. వివాహ దోషాలు తొలగిపోవాలంటే 21 దీపాలను నేతితో వెలిగించాలి. పుత్రదోషం తొలగిపోవాలంటే 51 దీపాలను, సర్పదోష నివృత్తికి 48 దీపాలు, కాల సర్పదోషం తొలగిపోవాలంటే 21 దీపాలను వెలిగించడం చేయాలి. కళత్ర దోష నివృత్తికి 108 దీపాలను వెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి.