బుధవారం, 20 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 17 ఏప్రియల్ 2025 (17:26 IST)

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

Sharwanand
Sharwanand
ఈమధ్య అన్ని సినిమాలలోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు వుంటున్నాయి. కథలు కూడా అలానే వుంటున్నాయి. పౌరాణికాలు సరే సాంఘికాల కథలు కూడా అవే కేటగిరికి వస్తున్నాయి. ఈ సినిమాకు ఓదెల దర్శకుడు సంపత్ నంది తెరపైకి ఎక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి సర్వే చేయించాడు. మహారాష్ట్ర ఆదిలాబాద్ బోర్డర్లో చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించారు. త్వరలో సెట్ పైకి వెళ్ళనుంది. 
 
ఈ చిత్ర కథ రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా. మహారాష్ట్ర ఆదిలాబాద్ బోర్డర్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలు దాన్ని ఫిక్షన్ గా మార్చి చేస్తున్నాం. 1960లో జరిగిన కథ గా సంపత్ నంది తెలియజేశారు. ఈసారి కూడా ఓదెల తరహాలో దైవశక్తి, దుష్ట శక్తి మధ్య సాగే కథగా వుంటుందా? లేదా? అనేది సస్పెన్స్ అంటూ చెబుతున్నారు. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం శర్వానంద్ నారి నారి నడుమ మురారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దీనికి భాను బోగవరపు కథ, నందు సావిరిగణ సంభాషణలు, సమాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.