శిల్పా రాజీనామా... లైట్ తీసుకున్న అఖిలప్రియ.. సీరియన్‌గా చంద్రబాబు
పాలెగాళ్ల సంస్కృతికి కేంద్రమైన రాయలసీమలో ఒక బలమైన నాయకుడు పార్టీ మారితే వచ్చే నష్టం, తగిలే దెబ్బ ఎలాంటిదో పసిగట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవర్నయినా చెప్పాల్సి ఉంటుంది. తన సుదీర్ఖ ప్రత్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైకాపాలోకి జంప్ చేయగానే నంద్య
పాలెగాళ్ల సంస్కృతికి కేంద్రమైన రాయలసీమలో ఒక బలమైన నాయకుడు పార్టీ మారితే వచ్చే నష్టం, తగిలే దెబ్బ ఎలాంటిదో పసిగట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవర్నయినా చెప్పాల్సి ఉంటుంది. తన సుదీర్ఖ ప్రత్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైకాపాలోకి జంప్ చేయగానే నంద్యాల నేత భూమా అఖిలప్రియ అమితానందంలో మునిగిపోయి రానున్న ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. తానీ అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు షాక్‌కి గురైనప్పటికీ వెంటనే తేరుకుని నష్ట నివారణకు నడుం కట్టారు. నంద్యాల పరిణా మాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే మంత్రి భూమా అఖిలప్రియ, ఇతర ముఖ్య నాయకులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా కర్నూలు జిల్లా కీలక నేత శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలవరపడి అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం ఉదయం కూడా మరోసారి అఖిలప్రియ, మంత్రులు అచ్చెంనాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
శిల్పాతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీని వీడతారని ఆయన నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. వారి వివరాలు తెలుసుకుని పార్టీని వదిలి వెళ్లకుండా చూడాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళితే ఏర్పడే ఇబ్బందులు, ఇతర అంశాలను వివరించా లని సూచించారు. పార్టీ శ్రేణుల్ని కూడా జారిపోకుండా చూడాలని కోరారు. శిల్పా వైఎస్సార్‌సీపీలో చేరడం వల్ల టీడీపీకి నష్టం ఉండదని ప్రచారం చేయాలని, ముఖ్య నాయకులు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని సూచించారు.
శిల్పా జంప్ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై చంద్రబాబు అఖిలప్రియను వివరణ కోరగా... ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్పినట్లు సమాచారం. అయినా శిల్పా పార్టీని వీడితే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లాలో చాలా ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించి నేతలందరితోనూ సీఎం మాట్లాడుతున్నారు.
నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపైనా వారితో చర్చించి వెంటనే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నిం టినీ వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ఇంకా ఏమేం పనులు చేయాలో ప్రణాళిక తయారు చేసుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు సూచించారు.