సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (15:04 IST)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ... తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు

jagan couples
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సీఎం క్యాంపు కార్యాలయమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ఈ సంక్రాంతి సంభరాలను ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా నిర్వహించారు. కార్యక్రమాలన సీఎం జగన్ వైఎస్ భారతిలు ఆసక్తిగా తిలకించారు. జగన్ దంపతులు గోమాతకు పూజ చేసి, ఆ తర్వాత భోగి మంటలను వెలిగించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్థాంకి వైఎస్ భారతీతో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని  వేడుకంటూ ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు.