మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 జనవరి 2024 (19:14 IST)

ఆ యువకుడు అచ్చం సీఎం జగన్‌లా వున్నాడే, ఎక్కడ?

The young man looks like CM Jagan
కర్టెసి-ట్విట్టర్
సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఓ ఫోటోలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలినట్లు ఓ యువకుడు కనిపించాడు. ఇంతకీ ఆ పోస్ట్‌లో వున్నది ఎవరు, ఏంటా సంగతి, తెలుసుకుందాం. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెండ్లి పిలుపు కోసం ప్రముఖులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. ఆ సమయంలో పక్కనే భట్టి కుమారుడు కూడా వున్నారు.
 
భట్టిని ఆహ్వానిస్తూ షర్మిల వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఆ సందర్భంగా భట్టి కుమారుడు కూడా అక్కడే వున్నారు. అతనిలో వైఎస్ జగన్ పోలికలు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోపై నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.