సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (16:39 IST)

ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

liquor
ఈ నెల 22వ తేదీన మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి ప్రత్యేక కారణం లేకలేపోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం సమీపంలో ఉన్న అన్ని మద్యం, మాసం దుకాణాలను మూసివేయాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రామమందిర ప్రారంభోత్సం కేంద్రంగా పండుగ వాతావరణం నెలకొంటుందని, అందుకే ఆలయం పరిస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసి వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మద్యం షాపులు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూసివేయనున్నారు. అంటే 22వ తేదీన డ్రై డేగా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్ (జైపూర్)లలో మద్యం షాపులు మూసివేయనున్నారు.