గబ్బిలాలను పూజించే గ్రామం.. అవి వుంటే డబ్బుకు లోటుండట..
గబ్బిలాలను ఆ గ్రామం పూజిస్తుంది. గబ్బిలాలకు పూజలు చేయడం ద్వారా ఆ గ్రామానికి ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తుల విశ్వాసం. ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యమూ పూర్తి కాదు.
గబ్బిలాలను పూజించే వింత గ్రామం బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది. గబ్బిలాలు నివసించే చోట డబ్బుకు లోటు ఉండదని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే ఈ సర్సాయి గ్రామానికి గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియని విషయం.
ఈ గబ్బిలాలు సర్సాయి గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలోని అరలి చెట్టుతో సహా వివిధ చెట్లలో నివసిస్తాయి. ఈ గబ్బిలాలను చూసేందుకు గ్రామానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.