గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (12:37 IST)

ఎయిరిండియా విమానం.. శాకాహారంలో చికెన్.. ప్యాసింజర్ అసంతృప్తి

chicken curry
కాలికట్ నుండి ముంబైకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, తాను ఆర్డర్ చేసిన శాఖాహార భోజనానికి బదులుగా మాంసాహారం అందించడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. ఇందులో భాగంగా ఎయిర్‌లైన్ విమానంలో క్యాటరింగ్‌పై తన అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. వీర జైన్ తన పీఎన్నార్ నంబర్, విమాన వివరాలతో పాటు ప్రయాణ సమయంలో అందించిన మాంసాహార భోజనాన్ని ప్రదర్శిస్తూ ఎక్స్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది. "నా @ఎయిర్ ఇండియా విమానం AI582లో, నాకు చికెన్ ముక్కలతో వెజ్ భోజనం అందించబడింది! నేను కాలికట్ విమానాశ్రయం నుండి విమానం ఎక్కాను. ఇది 18:40PMకి బయలుదేరాల్సిన విమానం, కానీ 19:40PMకి విమానాశ్రయం నుండి బయలుదేరింది." ఆమె చెప్పింది.
నేను క్యాబిన్ సూపర్‌వైజర్ (సోనా)కి తెలియజేసినప్పుడు, ఆమె క్షమాపణలు చెప్పింది.

"నా శాకాహార భోజనంలో మొదట ఆలస్యం, తర్వాత నాన్ వెజ్. ఇది చాలా నిరాశపరిచింది. ఇది నా మనోభావాలను దెబ్బతీసింది. దాని క్యాటరింగ్ సేవలు, ఆలస్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎయిర్ ఇండియాను కోరుతున్నాను" అని చెప్పింది.