సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (19:52 IST)

ప్రభాస్ భోజనం ఖర్చు అంతనా?

Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడని తెలిసిందే. దీంతో ఆయన ఒక్కసారి భోజనం చేస్తే.. దాదాపుగా ఖర్చు రెండు లక్షల వరకు వస్తుందట. దీనికి కారణం ప్రభాస్ ఒక్కడే భోజనం చేయడం చాలా అరుదని.. ఆయన భోజనం చేస్తే.. ఫ్రెండ్స్‌తో పాటు చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు తనతో పాటు షూటింగ్ లొకేషన్‌లో ఉన్న వందల మందికి స్వయంగా భోజనం తెప్పిస్తారట రెబల్ స్టార్. దీంతో ఆయన భోజన ఖర్చు లక్షల్లో ఉంటుందని అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక రాత్రి భోజనం ఖర్చు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఒక రాత్రి ఫుడ్ కోసం ప్రభాస్ ఖర్చు చేస్తారంట. ఈ స్థాయిలో భోజనం కోసం ఖర్చు చేసే హీరోలు ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ పై ఇంకెవరు లేరని చెప్పాలి.
 
ప్రభాస్ అంటేనే ఆతిథ్యం అని ఎవరైనా కచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అలాగే కాంట్రవర్సీలకి దూరంగా ఉండే ఏకైక స్టార్ కూడా ప్రభాస్ అని చెప్పాలి. అందుకే అందరి హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ మూవీస్ చూడాటానికి ఇష్టపడతారు.